ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన సందేశం మనది కాదు. యేసు ప్రభువుది . ఒకరోజు సృష్టి అంతా ఆయనను గుర్తించి స్తుతిస్తుంది. కానీ నేడు మన చుట్టూ ఉన్న ప్రజలు యేసును స్తుతించటానికి, వారు మనలో యేసును సజీవంగా చూడాల్సిన అవసరం ఉంది. మనము యేసు పేరుతో ఇతరులకు సేవ చేస్తాము. మనము అతని శరీరం - అతని కరుణగల చేతులు, కరుణ గల గుండె, మరియు మృదువైన స్వరం. కాబట్టి యేసును పైకి లేపుదాం - ఆయన గురించి ఇతరులకు చెప్పడం ద్వారా మాత్రమే కాదు, ఇతరులకు ప్రపంచంలో ఆయన ఉనికిగా సేవ చేద్దాం.
నా ప్రార్థన
దయ గల దేవా , ఇతరులతో మీ ప్రేమను పంచుకునే ఆధిక్యతకు ధన్యవాదాలు. నా పాపము నుండి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. యేసు కోసం ఇతరులను ఆశీర్వదించడానికి వారికి సేవ చేయడము కోసం నాకు పరిచర్యలు చేసినందుకు ధన్యవాదాలు. నా రక్షకుడైన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.