ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వారంన్నర దాటాము. ఈ సంవత్సరం మీరు చేసిన మార్పులు, కట్టుబాట్లు మరియు తీర్మానాలతో మీరు ఎలా ఉన్నారు? మీరు సరైన మార్గంలో కొనసాగడంలో ఇబ్బంది పడుతున్నప్పటికీ, వాటిని వదులుకోవద్దు లేదా విడిచిపెట్టవోద్దు . ఈ సంవత్సరానికి ఒకే ఒక నిబద్ధత అవసరమని గుర్తుంచుకోండి: ప్రభువు మనల్ని ఎక్కడికి వెళ్లాలని కోరుకుంటున్నాడో మరియు ఆయన మనల్ని ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అడగడం, అప్పుడు మనం అక్కడికి వెళ్లి దానిని చేద్దాము . తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించమని మరియు మన అడుగులను స్థిరపరచమని ప్రభువును అడుగుదాం!

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, సర్వశక్తిమంతుడైన ప్రభువా, నా అబ్బా తండ్రీ, అద్భుతంగా, పవిత్రంగా మరియు శక్తివంతంగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా గురించి, నా జీవితం గురించి, నా నిర్ణయాల గురించి మరియు నా పోరాటాల గురించి సున్నితంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు. నేను మీ లేఖనాలను అర్థం చేసుకోవడానికి మరియు నా జీవితం కోసం మీ చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించండి. మీరు నా అడుగుజాడలను పూర్తిగా స్థిరపరచాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామంలో, నేను ఈ మార్గదర్శకత్వం కోసం అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు