ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
అత్యంత ముఖ్యమైనది ఏమిటి? మనం విజయవంతంగా, ఫలించేవారిగా ఉండాలంటే మన దైనందిన జీవితంలో ప్రాధాన్యతలు కీలకం. మన శిష్యరికంలో కూడా ఇది నిజమే. ముఖ్యమైన, అతి ముఖ్యమైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నాం. ఏది ఆవశ్యకమో పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు: ప్రేమగల క్రియల్లో విశ్వాసం చూపబడుచున్నది . ప్రేమగల మరియు సహాయకరమైన చర్యలో తనను తాను చూపించని విశ్వాసము చనిపోయిన విశ్వసము వంటిది (యాకోబు 2). మన విశ్వాసాన్ని శక్తిమంతమైన, ప్రేమపూర్వకమైన సేవ ద్వారా వ్యక్తం చేయాలని యేసు కోరుకుంటున్నాడు.
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన దేవా, నేను ప్రాధాన్యమైనవాటిని కోల్పోయిన సమయాలను బట్టి నన్ను క్షమించు మరియు నేను పరిమితమైనదానియందు మాత్రమే దృష్టి పెట్టాను. ఇతరులకు ప్రేమపూర్వకంగా సేవ చేయడం కంటే నా ఆసక్తులు మరియు ఆందోళనలు నాకు ముఖ్యం అయిన ఆ సమయాలనుఉగుహ్లతెలుగు మీ ప్రేమను కనపరచులాగును ఇతరులకు సేవ చేయునట్లు వారిని చూచుటకు నేడు దయచేసి నాకు కళ్ళు ఇవ్వండి.. ..యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను . ఆమెన్.