ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
కాపాబడిన ! విమోచించబడిన ! క్షమించబడిన ! ఈ చిన్న వాక్యభాగంలో మూడు భావనలు ఉన్నవి . కానీ, అన్నింటికన్నా ముఖ్యమైనది "అతను ప్రేమిస్తున్న కుమారుడు " అనే పదబంధంతో సూచించబడింది . దేవుడు ఒక ప్రణాళిక, సందేశం లేదా శుభ్రమైన మరియు స్వచ్ఛమైన ప్రక్రియతో మనలను రక్షించలేదు. బదులుగా, అతను తనకు ఎంతో విలువైనదాన్ని తీసుకొని యేసును మన కొరకు రక్షణ బలిగా అర్పించాడు. వెల అపారమైనది. దీనిలో దాగియున్న ప్రేమ మితిమీరింది. ఫలితం మన గొప్ప బహుమతి.
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన దేవా మరియు ప్రియమైన తండ్రీ, మీరు యేసులో నాకు ఇచ్చిన బహుమతికి నా మాటలు లేదా నా పనులు తిరిగి చెల్లించలేవు. యేసు, మీ త్యాగం పట్ల నాకున్న ప్రశంసలు నన్ను సంతోషకరమైన కృతజ్ఞతా కన్నీళ్లతో కదిలించాయి. మీరు చేసిన అన్నిటికీ, మీరు నన్ను మలచిన విధానమంతటికి , మరియు మీకు అయ్యే వెలఅంతటికీ, నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు నా జీవితాన్ని మహిమకరమైన బలిగా అర్పిస్తున్నాను. ప్రభువైన యేసు, నీ పేరు మీద నేను నా ప్రశంసలను అర్పిస్తున్నాను. ఆమెన్.