ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

100వ కీర్తనలోని ఆరాధనకు సంబంధించిన పిలుపును మనం ప్రతిబింబిస్తూనే ఉన్నందున, దేవుని భౌతిక దేవాలయం యెరూషలేములో ఉన్న రోజుల నుండి నేటి ప్రబోధం వచ్చిందని మనము గ్రహించాలి. దేవుని నూతన నిబంధన ప్రజమైన మనకు, దేవుని ఆలయం క్రీస్తు సంఘము (1 కొరింథీయులకు 3:16) అలాగే మన భౌతిక శరీరాలును (1 కొరింథీయులు 6:19). మనం సంఘముగా ఒక కుటుంబం వలే ఆరాధించడానికి సమావేశమైనప్పుడు మన సంఘమునే కుటుంబంలోని ఇతరులతో కలిసి దేవుని మంచితనాన్ని ఆనందంగా జరుపుకుందాం. మనం ఉద్దేశపూర్వకంగా, పవిత్రతతో, మన జీవితంలోని ప్రతి ప్రాంతంలో దేవుణ్ణి గౌరవించటానికి మరియు ఆరాధించడానికి ఉద్దేశపూర్వకంగా జీవిస్తున్నప్పుడు మన శరీరాలు ఆయనకు పూర్తిగా లోబడి దేవుణ్ణి మహిమపరుస్తాము (హెబ్రీయులు 12:28- 13:16)! బహిరంగంగా, వ్యక్తిగతంగా మరియు సంఘంలో దేవుని నామాన్ని కృతజ్ఞతలు తెలుపుదాం మరియు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో, శక్తితో మన దేవుణ్ణి ప్రేమించి ఆరాధిద్దాం (మత్తయి 22:18-20).

నా ప్రార్థన

తండ్రీ, యేసు యొక్క ఉనికి మరియు మధ్యవర్తిత్వం మరియు పరిశుద్ధాత్మ యొక్క అధికారం మరియు ఉనికి ద్వారా మేము మిమ్మల్ని సమీపిస్తున్నప్పుడు మేము మీ సన్నిధిలోని అత్యంత పవిత్ర స్థలంలోకి ప్రవేశిస్తున్నాము . మేము స్తుతి పాటలు పాడుతున్నప్పుడు మీరు మా హృదయాలను వింటారని తెలిసి మేము సంతోషిస్తున్నాము. మేము కృతజ్ఞతాపూర్వకంగా మరియు ప్రశంసలతో మీ ముందుకు వస్తున్నప్పుడు మీరు మమ్మల్ని మీ సమక్షంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము మరియు మీరు మా కోసం చేసినదంతటిని బట్టి మేము ఎంతగానో అభినందిస్తున్నాము అని మీకు తెలియజేస్తున్నాము. మేము ఇంటికి వచ్చి మిమ్మల్ని చాలా ఆనందంతో ముఖాముఖిగా చూసే వరకు ఈ స్థలంలో మరియు ప్రార్థన సమయంలో మమ్మల్ని కలుస్తున్నందులు ధన్యవాదాలు. యేసు నామంలో, మేము నిన్ను స్తుతిస్తున్నాము మరియు ఆ మహిమాన్వితమైన రోజుకోసమే ఎదురుచూస్తున్నాము. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు