ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
బంగారు నియమము — బంగారము ఎందుకంటే ఇది నిజమైనది, శాశ్వతమైనది మరియు విలువైనది. మనం ఈ సూత్రాన్ని పాటిస్తే మన ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించండి — కేవలం మన "సంఘము జీవితంలో" మాత్రమే కాకుండా మన రోజువారీ జీవితంలో: మన కుటుంబంతో, మన సహోద్యోగులతో మరియు యజమానితో, మనం నిర్వహించే వ్యక్తులతో, నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులతో మరియు మనము డ్రైవ్ చేసే పరిసరాల్లో మరియు వెయిటర్లు మరియు పనివారు మరియు మనకు సేవ చేసే ఇతరుల వైపు గోల్డెన్ రూల్( బంగారు నియమము) ఆచరిస్తే అది ఎంత అద్భుతమైన ప్రపంచం అవుతుంది. నేను ఈ రోజుతో నా ప్రపంచాన్ని మార్చడం ప్రారంభిస్తానని అనుకుంటున్నాను! మరి మీరు ఎలా?
నా ప్రార్థన
ఉదారస్వభావము కలిగిన తండ్రీ, మీరు నాకు చాలా గొప్ప మరియు అద్భుతమైన బహుమతులను అనుగ్రహించారు. నేను మీకు తగినంతగా కృతజ్ఞతలు ఎప్పటికీ వ్యక్తపరచలేను. ప్రియమైన తండ్రీ, మీరు తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, మీరు నాతో న్యాయంగా లేదా తీర్పుతో కాకుండా దయతో వ్యవహరించిన విధానాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వారం నా జీవితాన్ని తాకిన వ్యక్తులతో అదే విధంగా చేసే శక్తిని నాకు ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.