ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
తాను ప్రేమిస్తున్న వారి జీవితంలో ప్రతి పాపపు సంఘటనను నిరోధించాలని యోహాను కోరుకుంటాడు. మనల్ని నిరుత్సాహపరిచేందుకు మరియు ఓడించడానికి సాతాను ఒక్క పాపాత్మకమైన సంఘటనను కూడా ఉపయోగించగలడని అతనికి తెలుసు. మన కొరకు పోరాడువాడు , రక్షకుడు ఉన్నారని తెలుసుకోవాలి. మనలను విమోచించడానికి ఆయన మూల్యం చెల్లించాడు, పాపపు శక్తిని అధిగమించడంలో సహాయపడటానికి ఆయన తన ఆత్మను పంపాడు, మరియు అతను తండ్రితో మాట్లాడతాడు మరియు మనలను క్షమించే హక్కును పొందియున్నాడు .
నా ప్రార్థన
తండ్రీ, నేను పాపం చేసినప్పుడు నా బలహీనత మరియు దుర్బలత్వంతో నేను ఇబ్బంది పడుతున్నాను. సిగ్గుపడే ఆ క్షణాల్లో కూడా, యేసు మీ పవిత్ర సన్నిధిలోకి తిరిగి రావడానికి నాకు అనుమతి వున్నందుకు నా కృతజ్ఞతలు. యేసు,నా రక్షణకు మరియు నా పక్షముగా పోరాడుటకు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను పడిపోయినప్పుడు సాతానును నన్ను నిరుత్సాహపరచనివ్వను. బదులుగా, మీ స్వభావముతో మరియు మీ కీర్తి కోసం జీవించడానికి నేను తిరిగి కట్టుబడి ఉన్నాను. ప్రభువైన యేసు, నా రక్షకుడైన నీ పేరిట నేను ప్రార్థిస్తున్నాను.