ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము దానిని పాడుతాము మరియు మన బహిరంగ ప్రార్థనలలో : "తండ్రీ, దేవా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము." అని చెబుతాముకానీ మన వాక్యము యొక్క ప్రారంభములో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ప్రభూ..." అను పదబంధాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. బహిరంగంగా, సమాజ ఆరాధనలో కూడా, దేవుని పట్ల వ్యక్తిగత ప్రేమను వ్యక్తపరచడం యొక్క ప్రాముఖ్యతను మనకు బోధించబడుచున్నాయి ."నేను నిన్ను ప్రేమిస్తున్నాను!" అని మీరు విశ్వం యొక్క సృష్టికర్తకు చివరిసారి ఎప్పుడు చెప్పారు.
నా ప్రార్థన
పరలోకమందున్న తండ్రీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు నా ప్రేమ కంటే ఎక్కువ అర్హులు. నువ్వు నన్ను మొదట ప్రేమించావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు మీ కుమారుని నాకు పెద్ద సోదరుడిగా పంపారు మరియు మీ కుటుంబంలో నన్ను దత్తత తీసుకున్నందుకు మూల్యం చెల్లించారు. నీ విశ్వసనీయత వల్ల నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నిన్ను ప్రేమించటానికి నీ దయతో నన్ను అనుమతించావు. యేసు నామములో నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.