ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుడు తమ పక్షాన ఉన్నాడని ఎంతోమంది చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. బానిసత్వాన్ని అమలు చేయడం, పక్షపాతం పాటించడం, అబద్ధం, అధికారులకు లంచం ఇవ్వడం, కపటత్వం పాటించడం, శక్తిలేని వారిపై బలవంతంగా అన్యాయం చేయడం మరియు "జాతి ప్రక్షాళన" పాటించడం వంటి వాటి ద్వారా దేవుడు మా దేవుడని " చెప్పబడుచున్నాడు . కానీ దేవుడు పరీక్షను చాలా సరళంగా చేస్తాడు: మంచిని చేయండి, మంచిని వెతకండి, లేదంటే మీరు నాకు చెందినవారు కారు ! ఆమోసు ప్రవక్త మాటల్లో, కోర్టులో, మార్కెట్లో మరియు ప్రార్థనా స్థలంలో ప్రజలందరికీ సమానత్వం అని అర్థం. దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం చెప్తే , మనం దేవుని వైపు, మంచి, న్యాయం మరియు దయ యొక్క పక్షానికి దగ్గరగా ఉండటం మంచిది!
నా ప్రార్థన
అమూల్యమైన మరియు సర్వశక్తిమంతుడైన దేవా , దయ మరియు న్యాయం మరియునీతిని ప్రేమించేవాడా , తరచుగా మరువబడిన వారి పట్ల మీ శ్రద్ధకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ పవిత్రాత్మ నాలో ఉన్నందున, నేను చెడు మరియు అణచివేత వైపు ఉన్నప్పుడు నన్ను దోషిగా నిర్ధారించి, ఇతరుల, నా సంస్కృతి మరియు నా ప్రపంచం యొక్క మోక్షానికి పని చేసేలా నన్ను కదిలించండి - శాశ్వతమైన మోక్షమే కాదు, చెడు మరియు ద్వేషం నుండి మోక్షం అవి ఎంతో ప్రభలముగా వున్నాయి . మీ రాజ్యం మీ హృదయంలో ఉన్నట్లుగా మా ప్రపంచంలో మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. యేసు నామంలో. ఆమెన్.