ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఒక వారం పాటు, యోహాను మనకు మళ్లీ మళ్లీ గుర్తు చేశాడు. క్రీస్తులో మన సహోదర సహోదరీలను మనము తప్పక ప్రేమించాలి. అయితే, ఈ జ్ఞాపిక అనేది సాదించబడిన విషయము . మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన పిల్లలను, క్రీస్తులోని మన సహోదర సహోదరీలను ప్రేమించాలి. ఈ పదం "తప్పక" లేదా "ప్రయత్నిస్తుంది" లేదా "కావాలి" అని అర్ధం కలిగియుందని గమనించండి. లేదు, మనం తప్పక చేయాలి అని అర్ధము వస్తుంది . గ్రంథంలో చాలా "తప్పక చేయాలి" లేదా "నీవు చేయాలి" అనే ఆదేశాలను ఎక్కువగా ఉంచకుండా బైబిల్ జాగ్రత్తపడింది.కాబట్టి దేవుని ఈ మాట స్పష్టంగా ఉంది. ఒకరినొకరు ప్రేమించడం ఐచ్ఛికం కాదు, చర్చించదగినది లేదా ఆలస్యం చేయవలసిన విషయం కాదు. దేవుని పిల్లలందరి పాపాల కోసం చనిపోయేలా దేవుడు యేసును పంపాడు. క్రీస్తు ఎవరి కోసం ఇంత ఇచ్చాడో వారిని మనం ఎలా ప్రేమించకుండా ఉండగలం ? పౌలు కొరింథీయులకు చెప్పినట్లుగా, "దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది!" మనము ప్రేమించాలి.
నా ప్రార్థన
సార్వభౌమ యెహోవా, మీ పిల్లలను కొందరిని మాత్రమే ప్రేమించాలని నేను చేసుకునే ఎంపిక పద్ధతిని క్షమించండి. క్రీస్తులో నా సహోదర సహోదరీలను ఆశీర్వదించడానికి, పోషించడానికి మరియు నిలబెట్టడానికి నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. గొప్ప పరీక్షలు మరియు భారాలు ఉన్న మీ పిల్లలలో చాలామంది కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను ... (దయచేసి దేవుని సహాయం అవసరమైన మీకు తెలిసిన వారిలో కొంతమందిని జాబితా చేయండి). అదనంగా, ప్రియమైన తండ్రీ, దయచేసి వారికి పరిచర్య చేయడానికి నన్ను ఉపయోగించుకోండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.