ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఇప్పుడు అది చాలా దూరం ఎంతనగా - సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అనగా తూర్పుకు మరియు పడమరకు ఎంత దూరమో , దేవుడు మన పాపాలను అంత దూరం చేసాడు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన పదము తొలగించబడింది. మనం పాపం చేసి, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు మన పాపాలను మాత్రమే క్షమించడు; అతను సమస్త దుర్నీతినుండి నుండి మనలను శుద్ధి చేస్తాడు. నాలో అపవిత్రమైనది అతనిలో నీతిమంతమైనది. అపవిత్రమైనది ఇప్పుడు శుభ్రంగా ఉంది. మాలినమైనది ఇప్పుడు మచ్చలేనిదైనది . ఇది ఎలా సాధ్యం? దేవుడు మనకు యేసులో ఈ కృపను ఇస్తాడు![1] కీర్తనకర్త కొంత భాగాన్ని మాత్రమే తెలుసుకోగలిగిన దాన్ని మనం ఇప్పుడు మరింత పూర్తిగా చూడగలం. దేవుడు మన పాపాలను చూడడు కానీ యేసు బలిని చూస్తాడు. యేసు రక్తము మనలను శుద్ధి చేస్తుంది మరియు పరిశుభ్ర పరుస్తుంది ! మన పాపం పోయింది, మనం శుభ్రంగా ఉన్నాం.
నా ప్రార్థన
దయగల తండ్రీ, నా పాపాలను క్షమించి వాటిని తొలగించినందుకు ధన్యవాదాలు. యేసు రక్తం మరియు నన్ను క్షమించాలనే మీ దయగల కోరిక కారణంగా నేను మీ ముందు పవిత్రంగా మరియు దోషం లేకుండా నిలబడగలిగినందుకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నీతిమంతుడైన తండ్రీ, మీరు నన్ను మీ పవిత్రాత్మతో బలపరచండి, తద్వారా నా ప్రవర్తన యేసులో నా గురించి మీ అంచనాను ప్రతిబింబిస్తుంది. నీ కుమారుడూ, నా రక్షకుడూ అయిన క్రీస్తు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.