ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
కొరింథీయులు తమ జ్ఞానం, వరము మరియు సహనమును బట్టి ప్రగల్భాలు పలికారు. కానీ, ఒక సంఘమునకు ఎంత వారములు ఇచ్చినా, ఎంత భూసంబంధమైన జ్ఞానం ఉన్నా, ఎంత సహనంతో ఉన్నా, ఆ సంఘములోని ప్రజలు చిన్న వాదనలు, వివాదం మరియు వికారమైన తగాదాలలో చిక్కుకుంటే వారు అపరిపక్వంగా ఉంటారు. క్రీస్తును ఎరిగిన మరియు చూపించే ప్రదేశంగా కాకుండా, వారి సమావేశాలు కేవలం "కేవలం మనుషుల" సమావేశం మాత్రముగానే యున్నాయి . మనం క్రీస్తులో పునర్నిర్మించబడ్డాము. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. దేవుడు మనలను చేసినదానికి అనుగుణంగా మనము జీవిద్దాం!
నా ప్రార్థన
పరిశుద్ధ మరియు నీతిమంతుడవైన తండ్రీ, నేను అసూయా ,తగాదా లేదా వివాదం చిన్నగా ఉన్నప్పుడు నన్ను పశ్చాత్తాపం చెందునట్లుగా చేయండి మీరు నన్ను మీ ప్రియమైన బిడ్డగా చూస్తారని నాకు తెలుసు, కాబట్టి మీరు నన్ను ఎలాగూ వుండాలో అని నిర్మిణాచారో ఆలాగు ఉండుటకు నాకు సహాయం చేయడానికి నేను పరిశుద్ధాత్మ సహాయం కోసం అడుగుతున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.