ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆత్మ మరియు జీవము యొక్క నియమము మన గొప్ప విమోచకుడైన యేసు మెస్సీయ యొక్క కార్యముపై నిర్మించబడింది! పాపము మరియు మరణము యొక్క నియమము నుండి మనము విముక్తి పొందాము. యేసు పునరుత్థానము వలన మరణము ఇక మనపై ఆధిపత్యం వహించదు. యేసు సిలువపై మన పాపపు రుణాన్ని తీర్చినందున పాపము మనపై ఎటువంటి హక్కును కలిగి లేదు. మనలో ప్రతి ఒక్కరూ దేవుని ముందు ఆయన నీతిమంతునిగా నిలబడతారు, చివరికి మన శక్తివంతమైన ప్రభువైన యేసుక్రీస్తు కార్యము వలన విముక్తి పొందుతాము. మన భవిష్యత్తులో ఎటువంటి శిక్ష లేదు, మహిమ మాత్రమే! అంతేకాకుండా, ఆత్మ ద్వారా మనకు జీవాన్నిచ్చే తన శాశ్వత ఉనికి గురించి యేసు మనకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు: దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. .తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. యోహాను 7:37-39.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నా విమోచన క్రయధనాన్ని చెల్లించి, నన్ను పాపం మరియు మరణం నుండి విముక్తి చేయాలనే మీ ప్రణాళికకు ధన్యవాదాలు. మీ సాటిలేని కృప కారణంగా నేను కలిగి ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. యేసు, నా హృదయంలో పరిశుద్ధాత్మను కుమ్మరించి, మీ జీవితం నాలో ఉప్పొంగేలా చూసుకున్నందుకు ధన్యవాదాలు. దేవా, యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు