ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మంచి విషయం ఏమంటే , దేవుడు మనలను నీతిమంతులుగా చేసి, మన పాపాలకు చెల్లించే త్యాగాన్ని అందించాడు, ఎందుకంటే మనలో ఎవరూ దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించరు. తన అనంతమైన కృపలో, మనం చేయలేనిది అనగా : పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుటకు మరియు మన పాపాలకు పరిపూర్ణ బలిగా తనను తాను అర్పించుకొనుట చేయమని దేవుడు యేసును పంపాడు ఇక మన పరిపూర్ణతను మరియు దేవుని అంగీకారాన్ని సంపాదించడానికి మనం ధర్మశాస్త్రం ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. బదులుగా, మనము "విశ్వాసం ద్వారా" జీవిస్తున్నాము, దేవుడు మనలను మన అసంపూర్ణత ద్వారా కాక క్రీస్తు పరిపూర్ణత ద్వారా చూస్తాడు, మన అపవిత్రతో కాక యేసు పవిత్రత ఆధారంగా మనలను తీర్పు తీర్చుతాడు , మన అన్యాయము ద్వారా కాక , కుమారుని నీతి ద్వారా మనలను చూస్తాడు. ఈ విధంగా, "ధర్మశాస్త్ర శాపానికి" కట్టుబడి ఉండకుండా, ధర్మశాస్త్రం యొక్క నీతిని మనము నెరవేరుస్తాము.
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడు మరియు పరిశుద్ధుడు, పాపం మరియు మరణం నుండి నన్ను తిరిగి తీసుకువచ్చిన ,మరియు మీ కోసం విజయవంతంగా జీవించడానికి నాకు ఒక మార్గం ఇచ్చిన మీ కృపా ప్రణాళికకు ధన్యవాదాలు . ప్రియమైన తండ్రీ, యేసు మరియు అతని అద్భుతమైన మరియు పవిత్ర జీవితం మరియు నా పాపాల కోసం ఆయన ఉదారంగా మరియు ప్రేమగల త్యాగానికి ధన్యవాదాలు. నేను చెప్పిన మాటలు, మరియు నేను జీవిస్తున్న విధానం, నీ దయ నా హృదయాన్ని బంధించిందని, యేసుపై నిజమైన విశ్వాసం నా జీవితాన్ని మార్చివేసిందని చూపిస్తుంది. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.