ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు మన జీవితాల్లోకి తెచ్చిన నిరీక్షణ గురించి మనం సిద్ధంగా ఉండాలి మరియు ప్రజలకు చెప్పగలగాలి! కానీ మనం ఈ నిరీక్షణను పంచుకున్నప్పుడు, రెండు విషయాలు ముఖ్యమైనవి అవి : మన విశ్వసనీయతను కనపరుస్తున్నామా - యేసు నిజంగా మన హృదయాలకు ప్రభువా - మరియు మన స్వభావమును - మన ఒప్పించే విధానంలో మనం సౌమ్యత మరియు గౌరవాన్ని చూపించుచున్నామా . వాదాలలో గెలవడమే లక్ష్యం కాదు, దేవునికొరకు హృదయాలను గెలవాలి.
నా ప్రార్థన
పవిత్ర మరియు ప్రేమగల తండ్రీ, యేసులో మీ దయను మాట్లాడినందుకు ధన్యవాదాలు. నేను మరే ఇతర సందేశాన్ని విన్నానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. యేసుపై నా నిరీక్షణను పంచుకోవాలనే నమ్మకాన్ని నాకు ఇవ్వండి, కానీ మీ దయను ప్రతిబింబించే విధంగా ఉండాలి . నా నిరీక్షనాధారమైనవాని నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.