ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఎంత అద్భుతమైన ఆలోచన! దేవుడు ఎన్నుకున్న మరియు పవిత్రమైన పిల్లలుగా మనం ఎంతో ప్రేమించబడుతున్నాము. కరుణ, దయ, వినయం, సౌమ్యత మరియు సహనం యొక్క జీవనశైలికి దేవుడు మనలను పిలేచుటను బట్టి ఆశ్చర్యపోనవసరం లేదు! ఈ లక్షణాలను మన తండ్రి మనతో ఎంత తరచుగా ఉపయోగించాలని అనుకొనుచున్నాడో ఆలోచించండి! దేవుడు మనతో సమృద్ధిగా పంచుకునే వాటిని మనం ఇతరులతో పంచుకోకుండా ఎలా ఉండగలము ?
నా ప్రార్థన
పరలోకంలో ఉన్న తండ్రీ, నాకు ఎంతో విలువనిచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నన్ను ఎలా కోరుకుంటున్నారో ఆలాగు ఉండకుండా నన్ను నేను కోల్పోయే కొన్ని మార్గాలు ఏవో నాకు తెలుసు, మరియు మీరు నన్ను మీ ప్రియమైన మరియు పవిత్రమైన బిడ్డగా ఎన్నుకోవటానికి ఇష్టపడకపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, మీరు నన్ను ఇంత గొప్పగా ప్రేమిస్తున్నారని మరియు నన్ను ఎంతో విలువగా చూసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా కీర్తి కోసం కాదు, మీ కోసం నన్ను మీలాగా చేయటానికి దయచేసి మీ పవిత్రాత్మ ద్వారా నాలో శక్తివంతంగా పని చేయండి .యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.