ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
పాత నిబంధనలో తన ప్రజలైన ఇశ్రాయేలు చరిత్ర ద్వారా , ఆయన ప్రజల అవిధేయ వైఖరి ఉన్నప్పటికీ విజయం, రక్షణ మరియు విశ్వాసపాత్రమైనది అని తెలియజేయు దేవుని కథ. దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నట్లే, దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు మనలను పట్టించుకుంటాడు. దేవుడు మన ప్రార్థనలను వింటాడు. దేవుడు మనలను ఆశీర్వదించి రక్షించాలని కోరుకుంటాడు. దేవుడు మనలను బలపరచాలని మరియు సమర్థించాలని కోరుకుంటాడు. ఆయనపై మన ఆశను ఉంచి, ఆయన తన "నీతిమంతుడైన కుడి చేతితో" మనలను "ఆదుకుంటాడని" విశ్వసిద్దాం.
నా ప్రార్థన
సృష్టికర్తయైన ఓ దేవా, నువ్వే నా దేవుడు. నేను నీ మీద నా విశ్వాసం ఉంచాలని ఎంచుకున్నాను! నీకు గౌరవం మరియు కీర్తి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి, దయచేసి నీ కోసం విజయవంతంగా మరియు ఉద్రేకంతో జీవించడానికి నా ధైర్యాన్ని రగిలించు. నేను నీ స్వభావాన్ని ప్రదర్శించి, నీ మహిమ కోసం జీవిస్తున్నప్పుడు, నాలో నీ శక్తివంతమైన ఉనికితో మరియు నా చుట్టూ ఉన్న నీ శక్తివంతమైన కృపతో నీవు నన్ను బలపరుస్తావు మరియు సమర్థిస్తావని నేను విశ్వసిస్తున్నాను. ఓ ప్రభూ, నీలో నేను నా ఆశను ఉంచాను. యేసు నామంలో, నీ మహిమను మరియు నా విశ్వాసాన్ని నీకు ప్రకటిస్తున్నాను. ఆమెన్.