ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మీకు తెలుసా యేసు మన రక్షకుడు మాత్రమే కాదని కానీ అతను మన సోదరుడు కూడా! "ఆయన తన సోదరుల వంటివాడు అవ్వవలసివచ్చింది " అని పరిశుద్దాత్మ కొన్ని వచనములలో చెప్పాడు. మనము దేవుని యొక్క తప్పిపోయిన బిడ్డలము, మన చెడ్డ శత్రువును, చెడు మరణాక్షకుడుగు సాతానును ఓడించగలుగునట్లుగా యేసు వచ్చి మన మరణాన్ని, మన మానవ దేహము మరియు దాని పరిమితులన్నింటినీ పంచుకున్నాడు.మరణం ఇక ఎన్నటికిని దాని కొక్కీలను మనలో కలిగి యుండలేదు లేదా అది ఎన్నటికిని మనపై పట్టు కలిగి లేదు! మన పెద్ద అన్న దానిని ఓడించి తండ్రి పక్కన మా స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్లియున్నాడు.
నా ప్రార్థన
సర్వోన్నతమైన దేవా నాలావుండుటకును మరియు నాలాంటివారి మధ్య ఉండుటకును యేసును పంపినందుకు నీకు కృతజ్ఞతలు.నేను కొంత గందరగోళంతో ముంచివేయబడ్డాను కానీ తేరుకొని తెలుసుకున్నాను యేసుని బహుమానం నన్ను నీ బిడ్డనుగా చేసింది అని ఇప్పుడు యేసు నాకు పెద్ద అన్నయ్య అని నేను గ్రంచించాను.అబ్బా, తండ్రి,!కొన్నిసార్లు తిరిగీ మన కుటుంబ కలయికను చూచుటకు ఇంకా వేచియుండలేను అనిపిస్తుంది. ఆనాటి ఆ కలయిక దినము వచ్చువరకు నీ కుటుంబము, నీ బహుమానము , నీ కుమారుని గురుంచి ఇతరులు తెలుసుకొనునట్లుగా నన్ను వాడుకొమ్ము .యేసు నామమున ప్రార్దిస్తున్నాము.ఆమెన్.