ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
అవ్వ మరియు ఆదాములను పాపానికి ప్రలోభపెట్టిన సర్పముపై ఇది దేవుని శాపం. సర్పము వెనుక ఉన్న వ్యక్తిత్వం సాతాను. ఈ శాపంలో కూడా, స్త్రీ సంతానం మరియు సాతాను మధ్య పోరాటం గుర్తించడంలో కూడా, దేవుడు మన మంచి భవిష్యత్తు కోసం తన వాగ్దానాన్ని పొందుపరిచాడు. యేసులో, ఆ భవిష్యత్తు వస్తుంది! సిలువలో జరిగిన యుద్ధంలో సాతాను గెలిచినట్లు కనిపిస్తాడు, కాని మూడు రోజులు గడిచేకొద్దీ సమస్తము మారిపోయెను . మరణంపై యేసు సాధించిన విజయం అపవాదికి కేవలం "గాయపడిన మడమ" ను మాత్రమే వదిలివేస్తుంది, కాని మరణాన్ని చివరి పదంగా మార్చకుండునట్లు సాతానును శక్తిహీనం చేస్తుంది. యేసు యొక్క ఖాళీ సమాధి తలుపు వద్ద చేడు మరియు దాని యొక్క ఉత్తమ ప్రణాళికలు మరియు గొప్ప శక్తి కేవలం అబద్ధముగా మిగిలెను.
నా ప్రార్థన
ప్రియమైన తండ్రీ, మరణం నుండి దాని ముల్లును తీసినందుకు మరియు నా భవిష్యత్తు కోసం ఒక నిశ్చయమైన ఆశను నెలకొల్పినందుకు ధన్యవాదాలు. యేసు మృతులలోనుండి లేచాడని నేను నమ్మడమే కాదు, నీవు కూడా నన్ను లేపి నీ సన్నిధిలో శాశ్వతంగా నన్ను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ శాశ్వత విజయం కోసం, నేను యేసు నామంలో నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్