ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

గత రెండు వారాలుగా, మన జీవితాల్లో ఆత్మ యొక్క పని గురించి మాట్లాడే అనేక లేఖనాలను చదివే ఆశీర్వాదం మనకు లభించింది. గత కొన్ని రోజులుగా, మనము దేవుని ప్రియమైన పిల్లలుగా, పెద్ద కుమారుని హక్కులన్నింటినీ కలిగి, మన తండ్రి వారసత్వానికి పూర్తి వారసులుగా జరుపుకుంటున్నాము. ఈ రెండు భావనలు ఈ రోజు మన వచనంలో ఒక మహిమాన్విత ప్రకటనలో కలిసి వస్తాయి: మనం దేవుని "కుమారులు", పూర్తి వారసత్వ హక్కులతో ఆయన పిల్లలము. మనం పురుషులమైనా, స్త్రీలమైనా, చిన్నవారమైనా, పెద్దవారమైనా పర్వాలేదు. మన జాతి పట్టింపు లేదు. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పని మరియు ఉనికి కారణంగా, మనం ఆయన పిల్లలు, నిజమైన వారసులము . మనకు కృప ఇవ్వబడటమే కాకుండా, ఆయన పిల్లలుగా జీవిస్తున్నాము మరియు ఆయన శాశ్వత కుటుంబం యొక్క ఆశీర్వాదాలను కూడా ఆస్వాదిస్తున్నాము.

నా ప్రార్థన

పరలోకమందున్న ప్రియమైన తండ్రీ, నీ బిడ్డగా నా జీవితంలో నీ నామం పవిత్రంగా గుర్తించబడాలి. పరలోక సైన్యాలు దానిని గౌరవించినట్లే నీ చిత్తం మరియు నీ రాజ్యం నా జీవితంలో తెలియబడాలి. తండ్రీ, ఈ రోజు నాకు అవసరమైన ఆహారాన్ని నీవు నాకు ఇస్తావని నేను నమ్ముతున్నాను మరియు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు వ్యతిరేకంగా పాపం చేసేవారిని క్షమించడానికి నేను కట్టుబడి ఉన్నందున దయచేసి నా పాపాన్ని క్షమించు. ప్రియమైన తండ్రీ, నీవు మహిమాన్వితుడవు. నీ రాజ్యం శాశ్వతమైనది మరియు అది నా హృదయ లక్ష్యం. నీ శక్తి నా బలానికి మూలం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రియమైన తండ్రీ. యేసు నామంలో, నీ ప్రియమైన బిడ్డగా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను మరియు స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు