ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యోగ్యుడు! ఎంత అందమైన మాట ఇది.మనలో అనగా ఎవరైతే యేసు శిష్యులైవున్నారో మనకు తెలుసు నిజముగా యోగ్యులైన ఆ ఒక్కరు ఎవరో. గ్రంధపు చుట్టలు తెరచి భవిష్యత్తును బయలుపరచుటకు అయన యోగ్యుడు.అయన ఘనత మరియు ఆరాధనకు యోగ్యుడు. ఎందుకనగా అయన పవిత్రుడు, పరిపూర్ణుడు , పరలోకసంబంధి అయినప్పటికీ మనకు క్షమాపణను కొని తెచ్చుటకును, విముక్తి కొరకు ,రక్షణకొరకు సిలువపై అయన మరణము ఆయనను యోగ్యునిగా చేసెను. ఆయన మనకొరకు మాత్రమే దీనిని చేయలేదు కానీ సమస్త జాతుల ,బాషల,సంస్కృతుల ప్రజల కోరకు చేసియుండెను.
నా ప్రార్థన
పరిశుద్ధుడవైన దేవుని గొర్రెపిల్ల!నీవు యోగ్యుడవు , నా ఆరాధన , నా ప్రేమకు నీవు యోగ్యుడవు,మరియు పరిశుద్ధుడవైన తండ్రి, ఆయనను పంపుటకును మరియు మమ్ములను రక్షించుటకైన మీ ప్రణాళికకు కృతజ్ఞతలు.క్రీస్తునందు మీ కృపను బట్టి నేను నా జీవితమును మీ భక్తిలోను మరియు మీ చిత్తప్రకారముగా జీవించగోరుచున్నాను.నేను ప్రక్కత్రోవలకు వెళ్లిన సమయములయందు దయచేసి నన్ను క్షమించుము. తిరిగి నీవైపునకు తిరుగుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతులు. నా పాపములకొరకు వదించబడిన నీ గొర్రెపిల్ల అయిన యేసు నామమున నా కృతజ్ఞతలు మరియు ప్రేమను అర్పించుచున్నాను.ఆమెన్ .