ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన నోర్లు ఆహారముచేత, అపవిత్రమైనవాటితో, ఆధారములేని పుకారులచేత నిండవచ్చు. లేదా ....మన నోళ్లు దేవుని స్తోత్రముచేను మరియు అయన ప్రేమపూరిత కృపచే కూడా నింపుకొనవచ్చు.మనము అనేక విషయాలు మాట్లాడవచ్చు,అనేకమందితో అనేక భిన్నమైన అంశాలు మాట్లాడవచ్చు. లేదా....దినంలో మనము పరలోక తండ్రి గొప్పతనం, ఘనత , మరియు అయన అద్భుత కార్యకలాపాలను ప్రకటీంచుటను కూడా న్నుకొనవచ్చు.మన దైనందిక కార్యకలాపాలతోపాటు మనం మన నోటిని దేవుని స్తోత్రముతో నింపుతు.ఇతరులకు అయన గొప్పతనమును తెలియపరుస్తూ ఇతరులు అయన కృపను తెలుసుకొనేవిధముగా ఎందుకు ప్రయతించకూడదు?.
నా ప్రార్థన
పరిశుద్ధ మరియు అద్భుతమైన తండ్రి, మీరు సమస్త సృష్టి యొక్క మరియు సమస్త దయకును దేవుడవు. యేసులో నీవు మాతో పంచుకున్న నీ దయకు కృతజ్ఞతలు . మృతులలోనుండి ఆయనను లేపినప్పుడు మరణం మీద మీ శక్తివంతమైన విజయానికి కృతజ్ఞతలు. నేను కొన్నిసార్లు త్రొట్రిల్లినప్పుడు మీ సహనానికి కృతజ్ఞతలు, కానీ నేను ఎల్లప్పుడూ యేసు యొక్క స్వభావుము ఖచ్చితముగా నాలో ప్రతిబింబిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓ నా ప్రభువా ఈ దినమంతయు నీకై నా ప్రేమను,ఆరాధనను తెలియజేయడానికి మరియు కనపరచుటకును దయచేసి నాకు సహాయం చెయ్యండి. యేసు నామమున నేను ప్రార్ధించున్నాను . ఆమెన్.