ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు దీనిని ఎందుకు చేసాడు, దీనిని ఎలా చేయగలిగాడు?ఆయన " దేవునిగా మనతో" వుండు కుంటూ కూడా "మానవుని శరీరాకారములో దేవునిగా " ఉండెను.మనము దీనిని పూర్తిగా గ్రహించలేము, కానీ ఆయన ఆలాగు యుండియుండెను.దేవుని కుమారుడు నజరేయుడైన యేసుగా , జన్మించి త్రొట్టిలో పరుండపెట్టబడి,సిలువవేయబడెను కూడా.ఆయన మృతులలోనుండి లేపబడ్డాడు మరియు దేవుని కుమారునిగా ఉండుటకు శక్తితో చూపబడ్డాడు. ఈ భూమి మీదను మరియు పునరుద్దనుడైనతరువాత , అలాగే దేవుని సింహాసనమందు కూడా దేవదూతలకు కనిపించెను. ఆయన ఈ లోకమందు సమస్త జనులకు బోధించండి వారిచే విశ్వసించబడెను.ఆయన కలిగియున్న మహిమ ఒకానొకరోజు మనకు చూపబడి మనతోకూడా పంచుకొనబడును.దైవభక్తిని అర్ధం చేసుకోవాలంటే యేసుతోనే మొదలుపెట్టాలి.
నా ప్రార్థన
పరిశుద్ధ మరియు అద్భుతమైన దేవా!, ప్రపంచవ్యాప్తంగా నా లాంటి వారితో పాటు, నా వంటి పాపిని విమోచించి మరియు రక్షించడానికైన ప్రణాళిక అద్భుతమై ఉంది. అలాంటి త్యాగానికి దారితీసిన మీ ప్రేమ మా గ్రహణశక్తికి మించినది. నన్ను ముంచివేసేన నీ కృపకు నా కృతజ్ఞతలు . నా పాపాలను క్షమించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.దైవత్వానికి సంబంధించిన మర్మము నేడు నా జీవితంలో, నా కుటుంబంలో,నా స్నేహితుల మధ్య, నా సహోద్యోగుల ముందు, నేను పాఠశాలకు హాజరయ్యేవారితో, మరియు ముఖ్యంగా నా శత్రువుల సమక్షంలో కనపరచునట్లుగా మరణం నుండి యేసును లేపిన మీ ఆత్మతో నాకు శక్తినివ్వండి.యేసు యొక్క శక్తివంతమైన నామమున నేను ప్రార్ధించుచున్నాను ఆమెన్.