ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
యేసు యొక్క ఘనత మరియు త్యాగం రెండింటిని మీరు ఎలా గ్రహించగలరు? ఈ నెలంతా మన ప్రభువు యొక్క గుర్తింపును చూస్తూ మనము ఇంకను ఆశ్చర్యపోయాము, ఆనందముపడ్డాము, కలవరపడి , ఆయన మహిమాన్వితమైన మరియు వినయపూర్వకమైన స్వభావమును బట్టి ఆశీర్వదించబడ్డాము. అయితే ప్రధాన విషయం ఏమిటంటే, అతను పరిపూర్ణ పరలోకం మరియు దోషపురితమైన మానవత్వం మధ్య శాంతిని నెలకొల్పాడు.అతను ఘోరమైన వెలపెట్టి, కల్వరిలోని హింసపూరితమైన మ్రాను పై తన స్వంత రక్తముతో సంధిని చేసెను. అతను తనలోని దేవుని ఆనందముతోను మరియు దేవుని స్వభావంతో దీనిని చేశాడు. మన పాపము బట్టి ఆయన దీనిని చేసాడు. అతని ప్రేమను బట్టి దీనిని చేసాడు.
నా ప్రార్థన
ఓ తండ్రి, నా పాపం కోసం ప్రాయశ్చిత్తంగా అలాంటి గొప్ప త్యాగము చేయవలసివచ్చింది. నన్ను క్షమించండి. మీరు అట్టి త్యాగం కోసం వెలచెల్లించటానికి ఇష్టపడినందుకు నేను చాలా కృతజ్ఞుడను . నా పాపం నేను ఎన్నడును సరిచేసుకోలేనివిధముగా మీకు మరియు నాకు మధ్య సృష్టించిన దూరాన్ని అనుసంధానపరచినందుకు నేను నిన్ను ఘనపరుచుచున్నాను. మీరు నేడు నాయందు ఆనందించి మరియు నా జీవితాన్ని మీ ఖరీదైన కృపకు మహిమకరంగా చూతురుగాక? యేసు నామములో మీకు నా కృతజ్ఞతలు.ఆమెన్.