ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేనిని మనం మన భద్రతకు ఆధారం చేసుకోవాలనుకుంటున్నాము? అదే మనం చేయగలిగేది, సాధించేది,సంపాదించేది, రక్షించేది మరియు దాచుకునేది అవుతుందా? లేదా తరతరాలుగా తనను తాను నమ్మకంగా చూపించిన మన దేవుడు మన ఆధారం అవుతాడా? మనం ఎంచుకోవాలి! మన ఎంపికలతో మనం ప్రతిరోజూ అలా చేస్తాము - మన సమయం, డబ్బు మరియు ప్రభావం అనే మన పెట్టుబడితో మనం ఏమి చేస్తాము. కాబట్టి, మీరు మీ భద్రతను దేనిలో కనుగొంటారు? మీరు మీ జీవితాన్ని దేనిలో పెట్టుబడి పెడతారు? నేను దానిని ప్రభువులో పెట్టుబడి పెట్టాలని ఎంచుకున్నాను! మీ సంగతి ఏమిటి?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నీవు ఇశ్రాయేలు తండ్రివి, జనముల దేవుడువి మరియు నా అబ్బా తండ్రివి. నేను నా నమ్మకాన్ని, నా భవిష్యత్తును, నా ఆశలను నీలో ఉంచుతున్నాను. నా డబ్బు, ఆస్తులు, విజయాలు మరియు సామర్థ్యాలు నావి కాదని నాకు తెలుసు. నిన్ను గౌరవించడానికి మరియు ఇతరులకు నీ కృపను తీసుకురావడానికి నువ్వు వీటిని నాకు అనుగ్రహించావు. దయచేసి నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుని, నీపై దృష్టి పెట్టునట్లు నా హృదయంలోని గర్వం మరియు స్వార్థాన్ని సున్నితంగా శుద్ధి చేయు. దయచేసి నీ ఆశీర్వాదాన్ని నాపై కుమ్మరించు - నేను వాటిని పొందగలిగేలా కాదు, కానీ నేను నీకు గొప్ప మహిమను తీసుకురావడానికి మరియు నీ కృపగల ఆశీర్వాదాలను అవసరమైన వారితో పంచుకొనునట్లు చేయి. యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు