ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
అప్పటి యూదాఇస్కరియోతు యేసును 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు, మనమైతే లెక్కలేనన్నిసార్లు ఆయనను ఊరకయే అమ్ముకున్నాము అని నా స్నేహితుడు ఒకడు ఒకానోక ఆదివారం సంఘములో చెప్పటం నాకు ఇంకా గుర్తు. అయితే దీనిలో మనము భరించడానికి కూడా వేదనగా వున్న విషయం ఏమిటంటే తన సొంతవాడే తనను అప్పగించనున్నారు అని తెలిసియుండటం. మన విషయంలో ఆలా ఎన్నటికిని జరగకుండునట్లు సకలవిధాలా ప్రయత్నిస్తూ దేవుని శక్తికొరకు మొఱ్ఱపెట్టుదము.ఒకవేళ అలాఎప్పుడైనా జరిగివుంటే పాపమునుండి తప్పించుకొని ఆయనయొద్దకు తిరిగి రావాలనే నిజాయితీ గల కోరికతో మనము అయన కృపయొద్దకు పరిగెత్తుకొనిపోవునట్లు జాగ్రత్తపడుదాము.
నా ప్రార్థన
నా తిరుగుబాటుతోకూడిన నిర్లక్ష్యము తో నీ హృదయమును ముక్కలుగా చేసిన సమయాలను బట్టి నన్ను క్షమించండి.నన్ను పాపము మరియు మరణము నుండి తప్పించిన మీ కుమారుని యొక్క త్యాగముపట్ల నాకు ఆశ మరియు ఆసక్తి లేకపోవుటవంటి నా అపరాధమును మన్నించుము.ఇతరులు ఆయనను చూసి ఆయనను యెరుగునట్లు నేను యేసుని కొరకు మరింత ఉత్సాహముగా జీవించాలని కోరుకుంటున్నాను. యేసుని విలువైన మరియు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.ఆమెన్.