ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఇతరులను తన దగ్గరకు తీసుకువచ్చునట్లుగా సిలువను ఉపయోగించుటకు ఇష్టపడుటయే అంతిమముగా దేవుని యొక్క "వెఱ్ఱితనమైవుంది".మొదటి చూపులోనే సిలువ అనేది ఒక ఘోరమైన మరియు భయంకరమైన సాధనం. ప్రపంచంలోని హృదయాలను కొల్లగొట్టడానికి నేరస్థుడిగా సిలువ వేయబడిన వ్యక్తిని మనం మన మానవ జ్ఞానంలో ఎన్నడూ చిత్రీకరించుకోలేము .కానీ దేవుడు మాత్రం చిత్రీకరించుకోగలిగాడు .సిలువ సాంస్కృతిక పరమైన సరిహద్దులను దాటి, భాషా అడ్డంకులను అధిగమించి ,జాతి విభేదాలు లేకుండా అందరిని చేరుకుంది .సిలువ అనేది దేవుని వెఱ్ఱితనము మరియు బలహీనతను ప్రదర్శించుచున్నది, వాటి ద్వారా మరణము జయించి మన హృదయాన్ని అతని దగ్గరకు తెచ్చుకొనెను.
నా ప్రార్థన
తండ్రి ఈ రోజున , అనేకులు ఆటలు, చమత్కారాలు చేస్తూ ,వెఱ్ఱివారి దినోత్సవము జరిగిస్తూ ఆటలాడుకుంటుంటే , కల్వరి సిలువలో యేసుపట్ల మీ "వెఱ్ఱితనము", "బలహీనతను"నాకు ఎక్కువగా గుర్తుచేయబడుచున్నాయి . అవి ఎంత శక్తివంతముగా మీ ప్రేమతో నన్ను తాకి , మీ కృప యొక్క నమ్మిక తో నన్ను నింపాయో నేను మాటలలో వర్ణించలేను.కృతజ్ఞతలు !మీరు నన్ను అలాగు ప్రేమిస్తున్నారని నేను ఎంతగానో విస్మయమొందాను. యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను.ఆమెన్.