ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
తన పరిచర్యలో, తన శిష్యులగునట్లుగా ఏ ఇరువురికి యేసు తనుతాను పూర్తిగా కనపరుచుకొనలేదో ఆ ఇరువురి జీవితం లో సిలువ యొక్క శక్తి ప్రదర్శించబడినది. చేయడానికి ఇబ్బందిగావుండు పస్కా పండుగ వంటి కఠిన సమయములో తమను అపవిత్ర పరచుకొని కూడా , తమను తాము విశ్వాసముగలవారీగా నిరూపించుకొనుచు ఆయన మరణంలో, ఆయనను సరిగా సమాధి చేయుటకు నిర్ణయించుకున్నారు. ఏది తాకని సమయంలో మనలను తాకినట్లుగానే సిలువ వారిని కూడా తాకెను.
నా ప్రార్థన
నీతిగల తండ్రి! సిలువ అనేది శాపగ్రస్తుల యొక్క ఘోరమైన చిహ్నం అని నాకు తెలుసు.అయినప్పటికి అది నాకు ఎంత ఘోరమైనదో అంత విలువైనది. మరియు ఎంత అసహ్యమైనదో అంత అందమైనది. సిలువ ద్వారా నీవు నన్ను నా పాపమునుండి కాపాడి నన్ను ఎంతగా ప్రేమించుచున్నావో కనపరిచావు.కృతజ్ఞతలు! నిన్నును మరియు కల్వరి సిలువలో వర్ణించలేని నీ బహుమానమును మహిమపరచునట్లుగా నన్ను చిన్నదైనా మార్గములో వాడుకొనుము . యేసు నామమున ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.