ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఆహ! క్రీస్తు పునరుద్ధానం గుర్తుచేసుకున్నాక దేవునియందు నమ్మిక కలిగించు ఈ కీర్తన ఒక్కసారిగా గొప్ప శక్తివంతమైన శబ్దమును కలిగి ఉందొ!దేవుడు తప్పక మనలను రక్షిస్తాడు.దేవుడు మన మొఱను వింటాడు.ఆయన ఖశ్చితముగా మన మొఱ వింటాడు మరియు మనకు రక్షణ తెచ్చునట్లుగా చేస్తాడు. అయితే మనము ఆయన సమాధానమును ఆశిస్తూ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఆయనకు మొఱ్ఱ పెడుతున్నామా లేదా? అనేది ప్రశ్న.
నా ప్రార్థన
అబ్బా తండ్రీ,నీ కృప మరియు శక్తి ఎంతగానో అవసరమైవున్న నా జీవితములోని సంగతులను గూర్చిన భారం నా హృదయంపై కలదు. నేను ఈ సమస్యలను మీతో పంచుకొనుచుండగా దయచేసి నా మొఱ్ఱను మరియు నా హృదయాన్ని వినండి ... అంతేకాక, ప్రియమైన తండ్రి ,దయచేసి నేను చింతన కలిగిన వారిపై మీ ప్రేమపూర్వక స్పర్శను ఉంచండి ... నా మొఱ్ఱ విన్నందుకు మరియు నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు .నా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.