ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఈ లోకమనేది మన గమ్య స్థానం కాదు. ఇది కేవలము మన యాత్రాస్థలం.మనలను మన లక్ష్యమునుండి ప్రక్కకు లాగి మనలను మన యొక్క ప్రయాణమును ముగించకుండునట్లుగా చేయునవి ఈ లోకములో అనేకము కలవు.వాస్తవానికి ఈ పాపపూరిత కోరికలు మనతో యుద్ధములో వున్నవి.కానీ పరిశుద్దాత్ముని శక్తి ద్వారా మనము "వద్దు" అని చెప్పవచ్చు.మరియు చీకటిలో చిక్కుకొని దేవునియొక్కవెలుగు ఎంతగానో అవసరమున్న మన ఈ లోకముయెదుట మనము నిరీక్షణతోను మరియు వ్యక్తిత్వముతోను జీవించవచ్చు.
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా!పాపముల వలన వైఫల్యముపొందినందుకు నన్ను క్షమించండి .సర్వశక్తిమంతమైన దేవా మీ స్వభావానికి మరియు పరిశుద్ధతకు మరింత దగ్గరవునట్లు నన్ను బలపరచండి.ప్రేమగల దేవా! నా స్నేహితులు ,నా కుటుంబిము మరియు ఇరుగుపొరుగువారు కూడా మీ జీవమును జీవించుచు,నిన్ను మహిమపరచునట్లు, ఆకర్షణీయంగా ఉండు పరిశుద్ధమైన జీవమును జీవించునట్లు నాకు సహాయము చేయండి.