ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఆహా! ఎంత శక్తివంతమైన మరియు హుందాగా ఉండే ఆలోచన. యేసు పునరుత్థానంపై మన విశ్వాసం మరియు ఆయనతో శాశ్వతంగా కలిసి ఉండటం చాలా కీలకమైనది, దానితో పోలిస్తే మిగతావన్నీ చాలా చిన్నవి. క్రీస్తులో మన నిరీక్షణ కేవలం ఇక్కడ మరియు ఇప్పుడు మాత్రమే కాదు, జీవితాన్ని అధిగమించి మరణ సంకెళ్లను విచ్ఛిన్నం చేసే ఆశ కూడా. అది మనకు ఈ ఆశను అందించకపోతే, అప్పుడు నిరీక్షణ అనేది లేదు. మన దగ్గర పంచుకోవడానికి శుభవార్త అంటూ లేదు. ప్రపంచం స్వార్థం మరియు పాపం అనే బురదలో మునిగిపోయింది. మనం మోసపోయాము మరియు జాలిపడేలా ఉన్నాము. కానీ, కృప వలన, నేను నమ్ముతున్నాను! మీరు కూడా నమ్ముతారని నేను నమ్ముతున్నాను! మరియు , యేసు ప్రియమైన శిష్యుడా, ఆ నమ్మకమే ప్రతిదీ మారుస్తుంది!
నా ప్రార్థన
తండ్రీ దేవా, ఆల్ఫా మరియు ఒమేగా, ఆది మరియు అంతమా, యేసు పునరుత్థానం ద్వారా పాపం మరియు మరణంపై మీరు సాధించిన విజయం అంటే పాపం, మరణం మరియు నరకంపై మా విజయం అని కూడా మేము నమ్ముతున్నాము! మీ సమక్షంలో నిత్యజీవాన్ని పంచుకోవడానికి యేసు మమ్మల్ని మృతులలో నుండి లేపుతాడని మేము విశ్వసిస్తున్నాము. మీతో ముఖాముఖిగా ఉండటానికి, మీ మహిమలో పాలుపంచుకోవడానికి మరియు మీ నామాన్ని ఎప్పటికీ స్తుతించడానికి మేము ఎంతగా ఎదురుచూస్తున్నామో మా అల్పమైన మానవ మాటలలో పూర్తిగా వ్యక్తపరచలేము. కాబట్టి, మీ పరలోక బహుమతి ఉచ్చరింపశఖ్యము కాని మూలుగులు, నిట్టూర్పులు మరియు భావోద్వేగాలలో మా కొరకు మధ్యవర్తిత్వం వహించినప్పుడు మేము మా హృదయాల ఆనందకరమైన కృతజ్ఞతను పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాము. (రోమా 8:26-27). యేసు నామంలో, మా ఆశను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆమెన్.