ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన ఆర్ధిక విలువను ఏది నిర్ణయిస్తుంది? డాలర్లా లేదా ఆస్తులా, లేదా పెట్టుబడుల పరంగా మనము దానిని గణిస్తున్నామా ? అంతిమ లాభం, అనిశ్చితమయిన విలువను పొందడం, నిజంగా చాలా సులభమైన సూత్రం ద్వారా నిర్ణయించబడుతుంది అని పౌలు తిమోతికి గుర్తుచేశాడు, అది ఎలా అనగా : నికర విలువ = (దైవభక్తి) X (సంతృప్తి ). వారి స్వభావరీత్యా దైవికమైనవారు, జీవితంలో వారి ఆశీర్వాదంతో సంతృప్తి చెందినవారే నిజమైన సంపన్నులని మనము గుర్తించినట్లయితే మనకేమి జరుగుతుంది?
నా ప్రార్థన
ఓ ప్రభువైన దేవా , ప్రతి ఆశీర్వాదం నీ నుండి ప్రవహింపజేయు ఏకైక దేవా, ఈ ప్రపంచం యొక్క దురాశ నుండి పరిశుద్ధమైన ఆర్ధిక నిర్ణయాలవైపుకు నా విలువలను మార్చండి. యేసు తన దైనందిన జీవితంలో ప్రదర్శించిన దైవభక్తికి నా స్వభావమును మార్చండి. మీలో మాత్రమే కనుగొనగల సంతృప్తిని నాకు నేర్పించండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్