ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మన జీవితములలోనికి ఇతరులను తీసుకొని వచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేసియున్నామని వారికి తెలియజేయుట మనకు ఎందుకు కష్టమైన పనిగాయున్నది?.దేవుడు తన ప్రేమను మరియు అంగీకారమును తన కుమారుడైన యేసు ద్వారా తెలియజేసాడు.యేసు యొక్క బాప్తిస్మము మరియు పునరుద్ధానము యందు ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను..అన్న దేవుని మాటలను జ్ఞాపకము చేసుకొనుము?..పౌలు కూడా తాను స్థాపించిన సంఘాలు శ్రమపడుతున్నపుడు ఆయన వారికొరకు ప్రార్ధన చేసినట్లు వారు తెలుసుకొవాలని చూసాడు (ఫిలిపి1:3).మన జీవితాల్లో ప్రత్యేకమైన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పడం గొప్ప ఆశీర్వాదం. ఇది ఆ ప్రజలు మన జీవితంలో ఉండటమును బట్టి మనము దేవునికి ధన్యవాదాలు తెలియచేసియున్నామని వారికి తెలియుట రెట్టింపైన దీవెనగా ఉంది. నేడు ఒక "రెట్టింపు దీవెన" కలిగిన ప్రజలుగా నుండుటకు కట్టుబడదాము !
నా ప్రార్థన
దయగల తండ్రి, నీవు అనేక విధాలుగా నన్ను ఆశీర్వదించావు! అయితే,నేడు మీరు ఇతర వ్యక్తుల ద్వారా నన్ను దీవించిన అనేక అద్భుతమైన మార్గాలు గురించి నాకు తెలుసు. నా జీవితంలో మీరు ఉంచిన అద్భుతమైన క్రైస్తవ ప్రజలను బట్టి ఇప్పుడు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను ... (ఇక్కడ ప్రత్యేక వ్యక్తుల పేర్లను ఉంచండి, ఆపై వారిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు తెలిపావని వారికి ఖచ్చితంగా తెలియనిమ్ము ). దయచేసి వారిని కాపాడి, బలపరచుము మరియు వారు నన్ను ఆశీర్వదించినట్లు ఇతరులను ఆశీర్వదించటానికి వారిని ఉపయోగించుకొనండి. యేసు నామములో ప్రార్ధించుచున్నాను . ఆమెన్.