ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దయను కనపరచడానికి యాదృచ్ఛిక చర్యలంటూ లేవు , ఉద్దేశపూర్వకము చేయు చర్యలు ద్వారా మాత్రమే జరిగే క్రియల ద్వారా దయను కనపరిచే అవకాశం ఉంది. మనం చూపగల దయ గురించి ఆలోచించుదాము. దయ మరియు ప్రయోజనకరమైన మార్గాల్లో నడుచుకొనుటకు మనము కట్టుబడి ఉన్నాము. దయ చూపే అవకాశం కోసం మనము ప్రార్థించాము. అప్పుడు అవకాశం అందజేయబడుతుంది ! మనము దయతో వ్యవహరిస్తాము. ఇందులో యాదృచ్చికముగా జరిగేది ఏది లేదు! ఇది చేతల్లోనే కాదు, మాటల్లో కూడా నిజం. పేలవమైన మాటలను నివారించేందుకు ప్రయత్నించడం కంటే, క్రీస్తును తెలుసుకునేలా ఇతరులను ఆశీర్వదించడానికి మరియు సహాయం చేయడానికి మన సంభాషణను ఉపయోగించమని మనము ప్రోత్సహించబడ్డాము.
నా ప్రార్థన
తండ్రీ, ఈ వారం నేను మాట్లాడిన అజాగ్రత్త మాటలకు నన్ను క్షమించు. ఈ అజాగ్రత్త పదాలు రెండు సార్లు పాపమూ చేసినంత అని నేను అర్థం చేసుకున్నాను అది ఎలా అనగా - నేను ఒకసారి నేను ఆ అజాగ్రత్త మాటలు మాట్లాడుట వలన చేసిన పాపం మరియు అది రెండవసారి పాపం ఎందుకంటే ఆ మాటలనుండి విమోచన పొంది సహాయం చేసే అవకాశం కొరకు నేను చూడలేదుగనుక . ఆశీర్వదించడానికి నా మార్గంలో మీరు ఉంచిన వారిని నేను చూసేలా నా కళ్ళు తెరవండి ప్రభూ. యేసు యొక్క ఆశీర్వాద నామం ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.