ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దైవభక్తిగల తల్లిని నీవు బాల్యం నుండి కలిగి ఉంటే యేసుపై విశ్వాసంతో, బైబిలు నుండి వచ్చిన కథలు, మరియు విశ్వాసానికి సంబంధించిన లాలిపాటలతో,మిమ్మును పెంచి పెద్దచేసి ఉంటే అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి . మీరు చేయకపోతే, మీ పిల్లలు మరియు మీ మునిమనవళ్లను వారి జీవితంలో దీనిని చేయునట్లు నిబద్దత కలిగివుండండి. అవును, వ్యక్తిగత విశ్వాసం కౌమారదశలో లేదా యుక్తవయసులో గెలుపొందవచ్చు, కానీ చిన్నతనంలో అలాంటిది ప్రారంభించటం ఆశీర్వాదకరం. పిల్లల జీవితాలను ప్రేమ,నిరీక్షణ, మరియు వాగ్దానాలతో నింపవచ్చును, ఎందుకంటె తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగల ఒక గొప్ప బహుమానం యేసు మాత్రమే.
నా ప్రార్థన
పరిశుద్ధమైన శ్రద్ధగల తండ్రీ, 'విశ్వాసముగల తల్లిదండ్రులు' అను అద్భుతమైన బహుమానమును బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.విశ్వాసం గల మనలో ఎక్కువ మంది వారి పిల్లలతో వారి విశ్వాసాన్ని పంచుకోవడంలో చురుకుగా ఉంటారు అని ప్రార్థిస్తున్నాను.దయచేసి నా కుటుంబాన్ని మరియు నా జీవితాన్ని, పిల్లలు మరియు మనుమలు యేసును సులభంగా నమ్మగల మరియు సురక్షితంగా యేసులో సంతోషించగల ఒక స్థలముగా చేయండి.ఆయన అమూల్యమైన నామములో నేను స్తుతించి కృతజ్ఞతలు తెలుపుచున్నాను.ఆమెన్.