ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము, మన హృదయాలలో దుర్మార్గతకు చోటిచ్చినప్పుడు ప్రజలు మనలోని నిజాన్ని చూడకుండునట్లు మన ముఖమునకు ముసుగు ఏర్పాటుచేసుకొనవలసిందే, కానీ నీతి మన లక్ష్యమైతే నిజాయితీతో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాము. మనము ఆ నీతిని బయటకి కనిపించేలా చేసినప్పుడు , మనము నిజాయితీగా ఉంటాము మరియు క్షమించమని అడుగుతాము , మన తప్పుల నుండి నేర్చుకొంటాము అప్పుడు మనం మన ముఖానికి దేనిని అడ్డముగా ఏర్పాటుచేసుకోనము.మనము దోషపూరితమైనప్పటికీ, దేవుడు మనపై ఇంకా పనిచేయడం ఆపలేదు అని మనకు తెలుసు .
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన దేవా , నీవు నన్ను అనేక సార్లు క్షమించినందుకు ధన్యవాదాలు. ఇతరుల నుండి మరియు నీ నుండి నా పాపాన్ని దాచడానికి ప్రయత్నించిన సమయాలను బట్టి నన్ను క్షమించండి. నేను ఏమి చేస్తున్నానో, నేను ఏమి చెపుతున్నానో, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నానో వాటన్నింటిలో నేను నిజాయితీగా, యథార్థమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. రోజు రోజుకి పెరుగుతున్న కొలతతో నీ ఈ దయను నాకు దయచేయుము. యేసు నామములో ప్రార్ధించుచున్నాను ఆమెన్.