ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ప్రజలు శుద్ధముగా ఆరాధించినప్పుడు, వారు తన చిత్తాన్ని కోరుకునేటప్పుడు, దేవుడు వారిని సేవ మరియు పని కొరకు పిలుస్తాడు. క్రైస్తవ ఆరాధన అనేది అంతం కాదు, కానీ క్రైస్తవ పరిచర్య కు ఆరంభం . ఆరాధన నుండి మీరు దూరంగా నడిచినప్పుడు దాన్ని తలుపు వద్ద వదిలివేయాలి అనే అనుభవంలో చిక్కుకోకండి . బదులుగా, మీ దైనందిన జీవితంలో ప్రపంచంలో బహిరంగ ఆరాధన మరియు సేవలకు మిమ్మల్ని ప్రేరేపించడము కొరకే ఆరాధన ఉంది అర్థం చేసుకోండి (రోమన్లు 12: 1-2). మీరు మీ సహోదరసహోదరీలతో ఆరాధించేటప్పుడు, పాటల మాటలు, గ్రంథం యొక్క సందేశం మరియు మీ హృదయంలో పవిత్రాత్మ యొక్క సాక్షమును కూడా వినండి. మీ ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక మిషన్‌కు పిలుస్తూ ఉండవచ్చు!
నా ప్రార్థన
తండ్రీ, దయచేసి నేను నిన్ను ఆరాధించేటప్పుడు మీ చిత్తాన్ని స్పష్టంగా గుర్తించి, మీ నాయకత్వాన్ని అనుసరించుటకు సహాయము చేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.