ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
నిజమైన నీతి మరియు పవిత్రత అనేవి దేవుడు మాత్రమే కలిగి ఉన్న లక్షణాలు అని మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా , దేవుడు మనము తన నాయకత్వానికి కట్టుబడి ఉన్నప్పుడు ఆ లక్షణాలను మన జీవితంలో పెరుగుతున్న వాస్తవికతగా మార్చడానికి తన ఆత్మను ఉపయోగిస్తాడు. నిన్నటి వాక్యము లో , మనము మన బలహీనమైన ప్రాంతాలలో మనలను పరిపక్వం చేసుకొనడానికి ఆత్మను అనుమతించటానికి మనము కట్టుబడి ఉన్నాము. ఈ రోజు ఎప్పుడైనా అదనంగా ఐదు లేదా పది నిమిషాలు కేటాయించి , దేవుని వాక్యాన్ని తెరిచి, మన నిర్దిష్ట దుర్బలత్వాలకు వర్తించే అనేక వాక్యభాగాలను చదవండి. అప్పుడు, ఈ బలహీన ప్రాంతాలలో మనలను క్రీస్తులాగా రూపాంతరం చెందించమని దేవుని ఆత్మను అడుగుదాం!
నా ప్రార్థన
ప్రియమైన తండ్రీ, దయ మరియు మహిమతో యేసు త్వరలో వస్తాడు! ప్రియమైన తండ్రీ, ఆ రోజు నేను నిర్దోషిగా కనబడతాను, నా శక్తి మరియు కృషి ద్వారా కాదు కానీ, నాలోని పనిలో మీ పరివర్తన శక్తి కారణంగా. యేసు నామంలో నేను దీనిని అడుగుతున్నాను. ఆమెన్