ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
నోవహు నీతిమంతునిగా పిలవబడ్డాడు తన తరంలో నిర్దోషి, దేవునితో నడిచి, ప్రభువు ఆజ్ఞాపించినదంతా చేశాడు (ఆది 6: 9, 22). మీరు అటువంటి ఉన్నత గౌరవం గురించి ఆలోచించారా? నేను యేసుతో కలిసి ఉండటానికి ఈ జీవితం నుండి వెళ్ళినప్పుడు వారు నా సమాధి తల రాయి మీద ఏమి వ్రాస్తారో నాకు తెలియదు, కాని ఈ వాక్యభాగములో నోవహు చెప్పినదానికి అర్హుడిగా ఉండటానికి నేను ఖచ్చితంగా ఇష్టపడతాను! మీ సంగతి ఏంటి ?
నా ప్రార్థన
పవిత్రమైన దేవా, నేను నీ కృప చేత రక్షించబడ్డానని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, నేను చేసిన గొప్ప లేదా నీతియుక్తమైన క్రియల వల్ల కాదు. అదే సమయంలో, తండ్రీ, నేను నిన్ను నా జీవితంతో గౌరవించాలనుకుంటున్నాను మరియు మీ పిల్లల జీవితంలో మీ ప్రేమపూర్వక దయ వల్ల కలిగే వ్యత్యాసాన్ని ఇతరులకు చూపించాలనుకుంటున్నాను. ప్రియమైన తండ్రీ, నోవహు యొక్క ఈ వర్ణనకు మరింత అర్హులుగా ఉండటానికి నన్ను కూడా ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్