ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము దేనికి అర్హులమో ఆ మొత్తాన్ని చెల్లిస్తే, మనము మన జీతమును ఏమాత్రము ఇష్టపడము. మరోవైపు, దయ మరియు కరుణల పిషయములో సమృద్ధిగా ఉన్న దేవుడు, నిజానికి మనము దేనికి అర్హలము కామో యేసు ఇచ్చిన త్యాగం వల్ల మనకు ఆ బహుమతిని ఇస్తాడు, . మీ గురించి నాకు తెలియదు కాని అది నన్ను అతనికి మరింత ఉద్రేకంతో మరియు నమ్మకంగా సేవ చేసే విధముగా చేయుచున్నది.
నా ప్రార్థన
మహిమాన్వితమైన మరియు దయగల తండ్రి, అన్నివిధములుగా పవిత్రుడు మరియు పరిపూర్ణుడా, మీ త్యాగ కృప మీ ధర్మానికి మరియు నా అసంపూర్ణతకు మధ్య ఉన్న గొప్ప అంతరానికి వంతెన వేసినందుకు ధన్యవాదాలు. నిత్యజీవ బహుమతికి ధన్యవాదాలు. నా క్షయమగు ఈ జీవితం మీకు పవిత్రంగా మరియు ఆనందంగా ఉండునుగాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.