ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఆరాధన అనేది ఒక స్థలం గురించి కాదు, మన తండ్రి గురించే అని యేసు మనకు బోధించాడు (యోహాను 4: 21-24). మన తండ్రిని పరలోకపు అతిధులు ఆరాధిస్తున్నారని తెలుసుకోవడం మనకు స్ఫూర్తినివ్వాలి, మనము ఎక్కడున్ననూ మనల్ని మనము తగ్గించుకోవాలి ఆ విధంగా చేయడానికి మనల్ని మనము ప్రేరేపించుకోవాలి . అన్ని ఇతర గుణ లక్షణాలకన్నా, దేవుడు పరిశుద్ధుడు . మూడు సార్లు పరలోకసంబంధీకులు అతని పరిశుద్దతను అంగీకరించారు - అతను ప్రత్యేకమైనవాడు, నిర్వచించబడనివాడు, స్వచ్ఛమైనవాడు, పరిపూర్ణుడు మరియు దైనందిక ప్రపంచం కన్నా చాలా ఎక్కువ. అతని మహిమ- భూమిని, ఆకాశాన్ని నింపుతుంది. అతను మనం ఊహించువాటన్నింటికంటే ఉన్నతమైనవాడు . ఆయన మన ఆరాధనకు, భక్తికి, విస్మయానికి అర్హుడు.
నా ప్రార్థన
పరిశుద్ధ దేవా,పరిశుద్ధుడగు తండ్రి, యుగయుగాలలో పరిశుద్ధ రాజా , నీ కృప యొక్క అద్భుతమైన బహుమతికి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ మహిమతో పోల్చితే, నీ సన్నిధిలో ఉండటానికి నేను అర్హుడిని కాదని నాకు తెలుసు. నా పాపాలకు గొర్రెపిల్ల వలే చంపబడిన యేసు బలి రక్తం ద్వారా మీరు నన్ను అర్హునిగా మరియు పవిత్రునిగా చేసారు. ఈ అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు, తద్వారా నేను నిన్ను ఆరాధించాను. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.