ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు రొట్టె మరియు ద్రాక్షారసాన్ని మన పెదవుల దగ్గర పెట్టినప్పుడు, మన "అపరాధం తీరిపోయింది" మరియు మన "పాపానికి ప్రాయశ్చిత్తం లభించినది అని దేవుడు చెప్పుచున్నాడు . పరిశుద్ధుడు, తన కృపతో, మనం ఎన్నడూ చేయలేనిది చేసాడు: మన పాపానికి పరిపూర్ణ త్యాగాన్ని తన కుమారుడితో అందించాడు. మన పవిత్రత, మన నీతి మరియు మన పరిపూర్ణత భూమిపై మన ప్రయత్నాల ద్వారా పొందినది కాదు కానీ, మనం దేవునికి నీతిగా ఉండటానికి పరలోకం యొక్క సింహాసనము నుండి వచ్చి తన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ద్వారా వచ్చినది. (2 కొరిం. 5:21 చూడండి).
నా ప్రార్థన
విలువైన మరియు ప్రేమగల తండ్రీ, నా పాపాల కోసం మీరు చేసిన పరిపూర్ణ త్యాగానికి ధన్యవాదాలు. పరిశుద్ధత మరియు పాపపు మరక లేకుండా మీ ముందు నిలబడటానికి అనుమతించే మీ అద్భుతమైన బహుమతి గురించి తెలుసుకొనడానికి ఇతరులకు సహాయపడటానికి దయచేసి నన్ను ఉపయోగించుకొనండి . నా రక్షకుడైన మరియు ప్రభువైన యేసు నామమున నీకు మహిమ, గౌరవం, కృతజ్ఞతలు మరియు ఘనత కలుగుగాక . ఆమెన్.