ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దైవభక్తిలో సంతృప్తి పొందడం జీవితపు గొప్ప సంపదలో ఒకటి అని పౌలు తిమోతికి చెబుతాడు (1 తిమో. 6: 6). ఈ నిధితో, ఆ పరిస్థితులలో మనం ప్రదర్శించే వ్యక్తిత్వం కంటే మన భౌతిక పరిస్థితులు మనకు చాలా తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మన గుండె అడుగు భాగమునుండి దేవుణ్ణి ప్రేమించడం కంటే మన ముగింపు తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. యేసు ప్రకారం చాలా కష్టమైన సవాలుతో కూడిన విషయమేదనగా ధనవంతులుగా వుండి , దైవభక్తిని చూపించే వారు, వారు దైవభక్తితో ఉండటానికి సంతృప్తికలిగి ఉన్నారని మరియు సంపద వున్నా సంపద లేకున్నా వారు ఆ రకమైన వ్యక్తులుగానే ఉంటారని నిరూపించారు. పేదలు మరియు దైవభక్తిగల వారు కూడా అదే సామర్థ్యాన్ని ప్రదర్శించారు. కాబట్టి చివరిగా మనం డబ్బు విషయంలో ఎంత ధనవంతులమనేది కాదు కానీ, మనం దయలో ఎంత ధనవంతులం!
నా ప్రార్థన
స్థిరమైన మరియు నమ్మకమైన తండ్రి, ఇప్పటికీ నా చంచలమైన మరియు కొన్నిసార్లు అత్యాశను కనపరుచు హృదయం నా జీవితంలో మీ ప్రత్యక్షతలోను మరియు స్వభావములోను నా సంతృప్తిని కనుగొనడంలో నాకు సహాయపడుతుంది. యేసు పేరిట ప్రార్థిస్తున్నాను . ఆమెన్.