ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఇది నిజము కాదా! మన సంస్కృతి యొక్క నైతిక మురికి బారిన మనం చిక్కుకున్నప్పుడు, దేవుని వాక్యం విసుకుగా మరియు అసంబద్ధంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సాతాను మన హృదయాలను కఠినం చేయడానికి పాపాన్ని ఉపయోగించినప్పుడు కూడా, దేవుని ఆత్మ కేవలం లేఖనాల పదాలను అర్థం చేసుకోవడం కంటే లోతైన స్థాయిలో మారాలని మనల్ని పిలుస్తుంది. అతని మాటను సర్జన్ స్కాల్పెల్( ఒక శస్త్ర చికిత్స నిపుణుడు ) లాగా ఉపయోగించగల మరియు మన హృదయాలపై అవసరమైన శస్త్రచికిత్స చేయగలిగే అతని ఆత్మ కోసం దేవునికి ధన్యవాదాలు.
నా ప్రార్థన
పరిశుద్ద దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయంతో, ఈ రోజు నేను నా జీవితంలో అనైతిక అలవాట్లను ఇష్టపూర్వకంగా మరియు నిర్ణయాత్మకంగా వదులుకుంటున్నాను. ఇవి మీ పవిత్రతను మరియు దయను కించపరచడమే కాకుండా, మీ ఇష్టము విషయములో నన్ను కఠినతరం చేస్తాయి, మీ స్వభావము నుండి నన్ను దూరం చేస్తాయి మరియు ఇతరులకు కనపరిచే నా సాక్ష్యాలను మొద్దుబారిస్తాయని నేను గుర్తించాను. దయచేసి నన్ను క్షమించండి మరియు నేను మీకు పూర్తిగా సంతోషించే జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నందున నన్ను ఆదుకోండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.