ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము సమస్త సృష్టి యొక్క దేవుడు మరియు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడైన యెహోవాకు చెందినవాళ్ళము (1 పేతు. 2: 9-10 తో పోల్చిచూడండి ). మనము దేవుని దయ పొందినవారు మరియు ఇశ్రాయేలు తండ్రుల పట్ల ఆయనకున్న ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. మనము భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ,మెస్సీయను పంపడానికి ఆయన ఎంచుకున్న ప్రజల చరిత్ర ద్వారా పనిచేసినట్లే మన భవిష్యత్తును దేవుడు నియంత్రిస్తాడు. మనం ఎదుర్కోవాల్సిన శ్రమల పరీక్షల ద్వారా ఆయన మనతో పాటు వస్తాడు. మన విముక్తి సాకారం అయ్యేలా చూస్తాడు. ఎందుకు? ఎందుకంటే మనం ఆయనకు చెందినవాళ్లం. మనము అతనివారము. ఆయన మనకు తెలుసు. ఆయన మనలను ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజలు ఎప్పటికీ ఆయన స్వాధీనమే. మనము సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలము !
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడు మరియు సార్వభౌముడవగు యెహోవా - మా తండ్రులు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవా - మీ వాగ్దానాలకు మీ విశ్వాసానికి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అనేక తరాల మీ విమోచన పనికి ధన్యవాదాలు. మమ్మల్ని విమోచించడానికి మీ కుమారుడిని మరియు మా మెస్సీయను పంపినందుకు నేను ఎంతో అభినందిస్తున్నాను. మీ సత్యాన్ని నాకు నేర్పడానికి లేఖనాలను ప్రేరేపించినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. మేము మీకు చెందినవారము అను ఆశీర్వాదానికి మరియు నా భవిష్యత్తును మీతో విశ్వసించగలనని తెలుసుకున్నందుకు నా ప్రగాడమైన కృతజ్ఞతలు తెలుపుచున్నాను . దయచేసి మీ ప్రత్యక్షత ఉనికి యొక్క అద్భుతమైన భావనతో మీ ప్రజలను ఆశీర్వదించండి మరియు మీకు మహిమను తెచ్చేందుకు మమ్మల్ని ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.