ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
దేవుడు తన కుమారుడిని పంపాడని ప్రపంచం ఎలా తెలుసుకుంటుంది? మన ఐక్యత ద్వారానా ? దేవుడు తన పిల్లలుగా మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? మనం ఐక్యతతో కలిసి జీవించినప్పుడు. ఆ ఐక్యత ఏమిటి? అది నిర్వచించడం కష్టం. ఐక్యతకు ఆధారం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండే వ్యక్తిత్వము యొక్క జీవితం, ఆయన మనలో నివసిస్తున్నట్లు చూడవచ్చు! ఇంకా ఈ రకమైన ఐక్యత ప్రపంచం చూడాలంటే, సువార్త కొరకు మనం ఒకరితో ఒకరు పనిచేసే విధానం, మన తేడాలను మనం సరిచేసుకునే విధానం, మనము ఒక సమూహంగా మనం స్థిరంగా లోకములోని ప్రజలతో వ్యవహరించే విధానం , మరియు దేవునికి స్పష్టంగా ముఖ్యమైన ప్రాంతాలలో మనం కలిసి వచ్చే విధానం ద్వారా జరుగుతుంది . అది అలానే ఉండనివ్వండి!
నా ప్రార్థన
తండ్రీ, మీ పిల్లలు, మిమ్మల్ని గౌరవించే, మీ స్వభావమును బహిర్గతం చేసే, మరియు యేసును ప్రభువుగా పిలవటానికి ఇతరులను నడిపించే మార్గాల్లో కలిసి రావడానికి దయచేసి మాకు సహాయం చెయ్యండి,. యేసుక్రీస్తు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.