ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
"వృద్ధులకు నేర్పించాలా?" "చిన్నవారి నుండి నేర్చుకోవాలా?" ఈ పద్యంలో తరాలను మించిన లోతైన అవగాహన మరియు గౌరవం ఖననం చేయబడినది. మానవ చరిత్రలో మొదటిసారిగా మన స్థానిక సంఘములను ఐదు తరాల ప్రజలతో పంచుకునే మనలో కొంతమందికి, సవాలు చేసేవిదంగా ఉన్న ఈ మాటలు ఈ రోజు మనకు మరింత వర్తిస్తాయి . పరివర్తన మరియు పునరుద్ధరణ స్థిరంగా ఉండాలంటే చిన్నవారైన వారికి నాయకులు మరియు గురువులు అవసరం. తన సత్యాన్ని మాట్లాడటానికి మరియు పునరుద్ధరణను తీసుకురావడానికి దేవుడు తరచూ యువకుల గొంతులను ఉపయోగిస్తున్నాడని పెద్దవాళ్ళు గ్రహించాలి. మన కాలంలో దేవుని ప్రజలుగా ఉండాలని కోరుకునేటప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించాలి మరియు ప్రార్థించాలి.
నా ప్రార్థన
దేవా, మేము ప్రతి వ్యక్తికి విలువనిచ్చునట్లుగా దయచేసి మీ కుటుంబంలో మాకు జ్ఞానం, సహనం ఇవ్వండి తద్వారా మేము ఒకరినొకరం గౌరవించుకొనుచు , వయస్సుతో సంబంధం లేకుండా వ్యక్తిత్వము మరియు పరిపక్వత యొక్క స్వరాలను వినుచు మరియు మీ సత్యాన్ని మాతో ఎవరు మాట్లాడినా సరే వినడానికి సిద్ధంగా ఉంటాము . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.