ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఈ వాక్యభాగములోని సంధర్భములో దేవుడు తన ప్రజలకు తనకు ఎంతో విలువైనవారో గుర్తుచేస్తున్నారు . అతను వారిని రూపించి విమోచించాడు. అతను వారిని విడిచిపెట్టడు . వారు ఏ సవాళ్లను లేదా ఇబ్బందులను ఎదుర్కొన్నా, వాటినుండి వారిని విడుదల చేయడానికి మరియు వారికి భద్రత మరియు విజయానికి తీసుకురావడానికి అతను వారితో ఉంటాడు. ఇదే వాగ్దానాన్ని మనం అంగీకరించవచ్చు; దేవుని విశ్వాసాన్ని చూపించడానికి చరిత్ర యొక్క ఆనవాలు ప్రయోజనం కూడా మనకు ఉంది. దేవుడు తన ప్రజలను ఎలా రక్షించాడో మరియు వారి శత్రువుల బానిసత్వం నుండి ఆయా సమయాల్లో తిరిగి ఎలా పొందాడో మనం చూడవచ్చు. దేవుడు తన పిల్లలను మరచిపోడు! వాగ్దానం ద్వారా మనకు తెలుసు. ఇది చరిత్ర ద్వారా మనకు తెలుసు. విశ్వాసం ద్వారా మనకు తెలుసు!
నా ప్రార్థన
సర్వశక్తిమంతుడైన దేవా , ఎల్లప్పుడూ సమీపముగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ దగ్గరి గురించి లేదా పనిలో మీ సమకూర్పును గురించి లేదా చరిత్రలో మీ అద్భుత కదలిక గురించి నాకు తెలియని సందర్భాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు. అయినప్పటికీ, ప్రియమైన తండ్రీ, నేను ఒంటరిగా ఉన్నప్పుడే మరియు మీ ఉనికి చాలా దూరంలో ఉన్నట్లు నేను అనుకొనుచున్నపుడు మీరు దగ్గరలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ సమయాల్లో, ప్రియమైన దేవా, దయచేసి శ్రమల సమయాల్లో నిలబడటానికి నాకు విశ్వాసం మరియు పట్టుదల ఇవ్వండి, తద్వారా మీ విజయ సమయాల్లో నేను కూడా భాగస్వామ్యం కలిగియుండగలను . యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.