ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన జీవితాలపై ఎవరి నియంత్రణ ఉంటుందో చూపిస్తాం. మనం దేవుని పిల్లలుగా జీవిస్తున్నామా? అప్పుడు మనం పరిశుద్ధాత్మ నాయకత్వానికి లొంగిపోతున్నామని కనపరుస్తాము ! మన ప్రపంచంలో ఆయన స్వభావంతో జీవించడం ద్వారా మనం తండ్రి పిల్లలుగా మన సంబంధాన్ని కనపరుస్తాము . మనం ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు (2 కొరింథీయులు 3:18) మన అన్నయ్య (రోమా 8:14-17; హెబ్రీయులు 2:14-18) (రోమా 8:14-17; హెబ్రీయులు 2:14-18) వలె పరివర్తన చెందడానికి (2 కొరింథీయులకు 3:18) సహాయం చేస్తుందని మనము పరిశుద్ధాత్మను విశ్వసిస్తాము.(గలతీయులకు 5:22-23). కాబట్టి, మనం ఆత్మ నియంత్రణలో జీవిద్దాం - లేఖనాలలోని ఆత్మ యొక్క ప్రేరేపిత వాక్యానికి లోబడుతూ మరియు మన దైనందిన జీవితంలో ఆత్మ యొక్క నాయకత్వాన్ని అనుసరిద్దాము . ఈ విధంగా, మనం చెప్పే మరియు చేసే ప్రతిదానిలో యేసును కనపరచవచ్చు మరియు పంచుకోవచ్చు!
నా ప్రార్థన
ప్రియమైన తండ్రీ, దయచేసి యేసుయొక్క అందం, దయ మరియు పవిత్రత నాలో కనబడటానికి సహాయం చెయ్యండి. ఈ రోజు మరియు ప్రతిరోజూ నేను చేసే పనులన్నిటిలో పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ, దయ మరియు ఫలాలను నా జీవితంలొ కనపరుచునుగాక . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.