ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
మనము ఎవరిని అనుసరిస్తామో ఎలా నిర్ణయిస్తాము? దేవుని కోసం సత్యము చెప్పే వారిలో ప్రత్యేకించి కొందరిని మాత్రమే వీరు మత రాబంధులు, అవినీతిపరులు మరియు గారడీవారని ఎలా చెప్పగలం? గొర్రెల కాపరియైనవారు వారి గొర్రెల కోసం తమ ప్రాణాన్ని అర్పించారా? లేదా? అని యేసు వచ్చి మనకు అంతిమ పరీక్షను చూపిస్తాడు.
నా ప్రార్థన
ప్రభువైన దేవా, యేసును గొర్రెల కాపరిగా పంపినందుకు ధన్యవాదాలు. అతని విశ్వాసం, ధైర్యం మరియు నమ్మకమును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆయన విశ్వాసము, ధైర్యము, మరియు ఆయన నా కొరకు తన ప్రాణమును పెట్టటమే కాక, లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణమును పెట్టినందుకు నేను మిమ్మును స్తుతించెదను. ప్రభువైన యేసు, నీ త్యాగపూరితమైన ప్రేమ మరియు పరిపూర్ణ త్యాగం కోసం నేను నిన్ను స్తుతిస్తున్నాను. "సింహాసనంపై కూర్చున్నవానికిని " మరియు "వదించబడిన గొర్రెపిల్లకి" నేను నా ప్రగాడమైన మహిమను మరియు దయ మరియు కృపను బట్టి ప్రేమపూర్వక మహిమను అర్పించుచున్నాను! రక్షకుని పేరిట ప్రార్థిస్తున్నాను ఆమెన్.